English   

విజ‌య్ దేవ‌ర‌కొండ జోడీగా క‌త్రీనా కైఫ్

Vijay Deverakonda
2021-05-06 18:52:41

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ ఆ త‌ర‌వాత అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. ఈ సినిమాతో విజ‌య్ దేశ‌వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా ప‌లు ఇంట‌ర్యూల‌లో హీరోయిన్ లే త‌మ ఫేవ‌రెట్ హీరో విజ‌య్ అని చెప్పేలా క్రేజ్ సంపాదించారు. 

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం విజయ్ దేవ‌ర‌కొండ క్రేజీ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాత్ తో లైగ‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ముంబైలో కరోనా ఉదృతి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో షూటింగ్ వాయిదా ప‌డింది. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న హీరోయిన్ గా బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే న‌టిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ మ‌రియు ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే క‌రణ్ జోహార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో పాన్ ఇండియా సినిమా చేసేందుకు ఒప్పుకున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా దాదాపుగా ఖ‌రారైంద‌ట‌. 

అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా క‌త్రీనా కైఫ్ న‌టించ‌బోతుందంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరేలా క‌త్రీనా ప్ర‌స్తుతం విజ‌య్ ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతోంది. అంతే కాకుండా ఇటీవ‌ల ఓ ఫోటోను షేర్ చేసిన క‌త్రీనా కొత్త మూవీ,...కొత్త హెయిర్ స్టైల్ ..కొత్త రోజు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. దాంతో క‌త్రీనా విజ‌య్ సినిమా గురించే ఇలా పోస్ట్ పెట్టింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్. ఇక ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. 

More Related Stories