English   

డిజిట‌ల్ ఎంట్రీకి రెడీ అవుతున్న గోవా బ్యూటీ

Ileana
2021-05-07 13:53:16

ప్ర‌స్తుతం ఓటీటీ హ‌వా న‌డుస్తుంది. ఇక క‌రోనా పుణ్య‌మా అని ప్రేక్ష‌కులు ఓటీటీని బాగానే అల‌వాటు చేసుకున్నారు. ఓటీటీ సంస్థ‌లు సైతం కొత్త కొత్త సినిమాలు టాక్ షోల‌తో ప్రేక్ష‌కుల‌ను త‌మ‌వైపు తిప్పుకుంటుంది. ఇక చిన్న స్థాయి న‌టీన‌టులే కాకుండా స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్ సైతం ఓటీటీల్లో సంద‌డి చేస్తున్నారు. 

ఇటీవ‌లే టాలీవుడ్ బ్యూటీ అక్కినేని సమంత ఆహా ఓటీటీపై సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. సామ్ జామ్ పేరుతో వ‌చ్చిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ షో కోసం స‌మంత భారీగా రెమ్యున‌రేష‌న్ పుచ్చుకున్న‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా హీరోయిన్ త‌మ‌న్నా తో కూడా ఆహా ఓ టాక్ షోను ప్లాన్ చేసింది. ఈ టాక్ షో త్వ‌ర‌లోనే షురూ కాబోతున్న‌ట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉండ‌గా ఇప్పుడు మరో బ్యూటీ కూడా డిజిటల్ మాధ్య‌మంపై సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తుంది. త‌ను మ‌రెవ‌రో కాదు. టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో సైతం ఎన్నో సినిమాల‌లో నటించి అల‌రించిన ఇలియాన త్వ‌ర‌లో ఓ టాక్ షో తో సంద‌డి చేయ‌బోతుంద‌ట‌. ఇప్ప‌టికే ఇలియాన టాక్ షో కోసం అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కూడా కుదిరింద‌ట‌. అంతే కాకుండా ఈ టాక్ షో కోసం ఇలియాన భారీగానే పుచ్చుకుంటున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. 
 

More Related Stories