English   

బంగార్రాజుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ

Nagarjuna
2021-05-07 16:19:25

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ప్రస్తుతం సినిమాలు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాలతో వచ్చిన నాగ్ సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా హిట్ తో జోష్ మీద ఉన్న నాగ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ పైనే పెట్టారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 

అయితే ఇప్పుడు సీక్వెల్ కు సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలోని నాగ్ పేరు "బంగ్గార్రాజు" ను టైటిల్ గా ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతే కాకుండా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమాలో నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఈ సినిమా గురించి తరచు కళ్యాణ్ కృష్ణ తో వీడియో కాల్ మాట్లాడుతున్నానని నాగార్జున అన్నారు. 

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోనాక్షి తో సంప్రదింపులు కూడా మొదలు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

More Related Stories