English   

ఆది పురుష్ షూటింగ్ కోసం కీలక నిర్ణయం

Prabhas
2021-05-07 16:35:50

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆది పురుష్ సినిమా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ముందు నుండి ముంబై లోనే జరుగుతోంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. దాంతో ప్రభాస్ హైదరాబాద్ చేరుకుని రెస్ట్ తీసుకుంతున్నారు. 

కాగా ఇప్పుడు ఆదిపురుష్ షూటింగ్ ను చిత్రయూనిట్ మళ్లీ మొదలు పెట్టాలనుకుంటుంది. కానీ ముంబై కరోనా ఉధృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ షూటింగ్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. దాంతో చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ కు మకాం మారుస్తుంది. అంతే కాకుండా మూడు నెలల పాటు సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరగబోతుందట. మూడు నెలలంటే సినిమా ఎంతవరకు షూట్ ఇక్కడే పూర్తి చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తోంది. అంతే కాకుండా విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

More Related Stories