English   

బాలీవుడ్ బ్యూటీ కంగనాకు కరోనా పాజిటివ్ 

Kangana Ranaut
2021-05-08 13:23:31

బాలీవుడ్ బ్యూటీ కంగనా రొనౌత్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొద్దిరోజులుగా తన కళ్ళు మండుతున్నాయని...శరీరం కూడా బలహీనంగా అనిస్తోందని టెస్ట్ చేసుకోగా పాజిటివ్ వచ్చినట్టు తెలిపింది. అంతే కాకుండా తాను హిమాలయాలకు వెళ్లనుకున్నానని అందుకోసం ముందు జాగ్రత్తగా టెస్ట్ చేసుకున్నట్టు పేర్కొంది. దాంతో రిపోర్ట్స్ లో పాజిటివ్ వచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతం హోమ్ క్వారన్టైన్ లో ఉన్నట్టు కంగనా స్పష్టం చేసింది. వైరస్ తన శరీరం లోకి ఎలా ప్రవేశించిందో తెలియడం లేదని..కానీ ఇప్పుడు వైరస్ ను నాశనం చేయగలను అంటూ ధీమా వ్యక్తం చేసింది. మీరు కూడా వైరస్ కు భయపడకండి...భయపడితే ఆ వైరస్ మరింత భయపెడుతోంది. అదో చిన్న ఫ్లూ తప్ప మరేమీ కాదు. రండి వైరస్ ను నాశనం చేద్దామంటూ కంగనా ట్వీట్ లో పేర్కొంది. ఇక  సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫైర్ అయ్యే కంగనా ఇప్పుడు వైరస్ పై కూడా ఫైర్ అవుతూ భయపెడుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. అంతే కాకుండా మరి కొందరు కరోనా ను జయించి కొలుకున్నారు.

More Related Stories