English   

క‌రోనాను జ‌యించిన జ‌నసేనాని

Pawan Kalyan
2021-05-08 13:30:33

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కొద్దిరోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తిరుప‌తి మీటింగ్ కు హాజ‌రైన అనంత‌రం ఆయ‌న కాస్త అస్వ‌స్త‌త‌కు గురికావ‌డంతో క‌రోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ఆయ‌న ఇంటికి దూరంగా త‌న ఫామ్ హౌస్ ఉండి వ్య‌క్తిగ‌త వైద్యుల స‌మ‌క్షంలో చికిత్స తీసుకున్నారు. కాగా ఇప్పుడు ఆయ‌న క‌రోనా ను జ‌యించిన‌ట్టు ప్ర‌క‌టించారు. మూడు రోజుల క్రితం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వ్య‌క్తిగ‌త వైద్యులు ఆర్టీపీసీఆర్ ప‌రిక్ష చేయ‌గా నెగిటివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. క‌రోనా అనంత‌రం వ‌చ్చే నీర‌సం వంటివి మాత్రం ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఆరోగ్య‌ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని వైద్యులు వెల్ల‌డించారు. 

త‌న ఆరోగ్యం గురించి పూజ‌లు చేసిన జ‌న‌సైనికుల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఉదృతి నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. వైద్య నిపుణులు అందిస్తున్న సూచ‌న‌ల‌ను పాటించాల‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడేళ్ల త‌ర‌వాత హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక ప్ర‌స్తుతం ప‌వ‌న్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ తో పాటు హ‌రిహ‌ర‌వీర‌మల్లు సినిమాల్లో న‌టిస్తున్నారు. అయితే అనారోగ్యం దృష్ట్యా ప‌వ‌న్ జూన్ వ‌ర‌కూ షూటింగ్ ల‌లో పాల్గొనకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తుంది. 
 

More Related Stories