English   

ఈ యేడాదే ర‌కుల్ పెళ్లి...అన్ని సీక్రెట్స్ అత‌డికి చెప్పేస్తా : మంచు ల‌క్ష్మి

Manchu Lakshmi
2021-05-08 17:04:26

టాలీవుడ్ న‌టి మంచు ల‌క్ష్మి హీరోయిన్ ల‌తో ఎక్కువ క్లోజ్ గా ఉంటారు. ముఖ్యంగా ర‌కుల్ ప్రీత్ సింగ్, తాప్సి ల‌తో చాలా క్లోజ్ గా ఉంటారు. అంతే కాకుండా వారితో క‌లిసి పార్టీల‌కు వెలుతూ సందడి చేస్తుంటారు. అయితే తాజాగా మంచు ల‌క్ష్మి హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ తో క‌లిసి రానా హోస్ట్ గా చేస్తున్న నంబ‌ర్ వ‌న్ యారీ షోకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రానా మాట్లాడుతూ..ర‌కుల్ వ‌చ్చాక మంచు ల‌క్ష్మి చాలా మారిపోయింద‌ని అన్నారు. అన్ని విష‌యాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారని అన్నారు. అంతే కాకుండా ఎక్క‌డ‌కు వెళ్లినా ర‌కుల్ ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తుందని చెప్పాడు. అంతే కాకుండా మంచు ల‌క్ష్మి ర‌కుల్ పెళ్లి మ్యాట‌ర్ రావ‌డంతో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. 

ర‌కుల్ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతుంద‌ని చెప్పింది. దాంతో మంచు ల‌క్ష్మి వ్యాఖ్య‌ల‌ను కండిస్తూ ర‌కుల్ అలాంటిదేమీ లేద‌ని చెప్పింది. అయిన్ప‌టికీ మంచు ల‌క్ష్మి పెళ్లి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని చెప్పింది. లేదంటే బాయ్ ఫ్రెండ్ వ‌స్తాడేమో అని చెప్పింది. అంతే కాకుండా చేసుకోబోయే అబ్బాయి ఎవ‌రో త‌న వ‌ద్ద‌కు వ‌స్తే ర‌కుల్ గురించి అన్ని విష‌యాలు చెబుతాన‌ని తెలిపింది. ఇదిలా ఉండ‌గా గ‌తంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ రానా డేటింగ్ లో ఉన్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ తాము మంచి ఫ్రెండ్స్ మాత్ర‌మేన‌ని ర‌కుల్ పేర్కొంది. 

More Related Stories