English   

క‌రోనాతో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు న‌టుడు టీఎన్ఆర్ క‌న్నుమూత‌

TNR Died Of Covid19
2021-05-10 12:01:49

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు న‌టుడు టీఎన్ఆర్ క‌రోనాతో క‌న్నుమూశారు. కొద్ది రోజుల క్రితం టీఎన్ఆర్ కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. క‌రోనా నుండి కోలుకున్న త‌ర‌వాత ఆయ‌న ఆరోగ్యం మ‌ళ్లీ క్షీణించ‌డంతో ఆస్ప‌త్రిలో చేరారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ రోజు ఆయ‌న క‌న్నుమూశారు. అస‌లు పేరు తుమ్మ‌ల న‌ర్సింహారెడ్డి కాగా టీఎన్ఆర్ గా పాపుల‌ర్ అయ్యారు. ఐడ్రీమ్స్ అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా టీఎన్ఆర్ ఎంతో మంది ప్ర‌ముఖ సెలబ్రెటీల‌ను ఆయ‌న ఇంటర్యూ చేశారు. టీఎన్ఆర్ మృతికి పలువురు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఇదిలా ఉండగా టీఎన్ఆర్ సినిమాల్లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకున్నారు. సంపూర్నేష్ బాబు హీరోగా న‌టించిన హృద‌య కాలేయంలో న‌టించారు. అంతే కాకుండా ఇప్పుడిప్పిడే టీఎన్ఆర్ కు సినిమాల్లో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఎప్రిల్ 24న ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాన‌ని ఆయ‌న ఓ ఫోటోను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇంత‌లోనే ఆయ‌న మృతి చెంద‌డం బాధాక‌రం. 

More Related Stories