English   

బన్నీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న నితిన్

Nithiin Vakkantham Vamsi
2021-05-10 12:25:23

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి తరవాత ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది నితిన్ రెండు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. వాటిలో చెక్ ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకోగా... రంగ్ దే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో మాస్ట్రో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగానే నితిన్ మరికొన్ని సినిమాలని లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే పూరి జగన్నాథ్ ఓ కథ చెప్పగా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాకు కూడా నితిన్ ఒప్పుకున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. అది కూడా రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ తో నితిన్ సినిమా ఉండబోతుందని టాక్. 

ఇప్పటికే వక్కంతం వంశీ అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో వంశీకి నిరాశే మిగిలింది. అయితే ఇప్పుడు మాత్రం వంశీ ఓ మంచి కథతో నితిన్ దగ్గరకు వెళ్లారట. ఆ కథ  నితిన్ కు కూడా నచ్చడం తో గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రం కరోనా పరిస్థితులు సెట్ అవ్వగానే సెట్స్ పైకి వెళుతుందట.

More Related Stories