English   

ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్న సీటిమార్

 Seetimaarr
2021-05-10 12:54:55

క‌రోనా ఎఫెక్ట్ తో సినిమాల‌న్నీ మ‌ళ్లీ ఓటీటీ బాట ప‌ట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అన‌సూయ లీడ్ రోల్ చేసిన థాంక్యూ బ్ర‌ద‌ర్ సినిమా ఓటీటీలో విడుద‌లైంది. ఇప్పుడు మ‌రికొన్ని సినిమాలు కూడా అదే దారిలో ఉన్న‌ట్టు వార్త‌లు వాస్తున్నాయి. వాటిలో గోపీచంద్ హీరోగా న‌టించిన సీటీమార్ సినిమా కూడా ఒక‌టి. ఈ చిత్రాన్ని ఎప్రిల్ 2 న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ అదే టైమ్ కు వ‌కీల్ సాబ్ కూడా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది..అంతే కాకుండా  సీటీమార్ కు సంభందించిన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ పెండిగ్ ఉండ‌టం వ‌ల్ల సినిమా విడుద‌ల‌ను నిలిపివేశారు. త్వర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. కాని మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌తో మూత‌ప‌డ్డాయి. 

ఈ నేప‌థ్యంలో సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని గోపీచంద్ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోందట‌. ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌తో మంచి అమౌంట్ కే సినిమాను సొంతం చేసుకుంద‌ట‌. దాంతో సినిమా ఓటీటీలో రావడం కాయ‌మ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా సినిమాలో మ్యాచో మ్యాన్ గోపీచంద్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాహీరో హీరోయిన్ లు గా న‌టించారు. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ చిత్రానికి సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి.

More Related Stories