English   

సోనూసూద్ పై దర్శకుడు మెహర్ రమేష్ ప్రశంసలు

 Sonu Sood
2021-05-10 17:05:33

రియల్ హీరో సోనూసూద్ తన సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా నిలిచిన సోనూ ప్రస్తుతం ఎంతోమంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఓ భారతి అనే కరోనా పేషంట్ లంగ్స్ 80 శాతం ఇన్ఫెక్షన్ కు గురవడం తో మెరుగైన చికిత్స కోసం ముంబై నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. అయితే భారతి చికిత్స పొందుతూ మరణించింది. దాంతో సోనూ సూద్ భావోద్వేగానికి లోనయ్యారు. 

ఇక తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ సోనూ సూద్ ను ఓ కరోనా పేషంట్ కోసం రెమిడెసివిర్ ఇంజక్షన్ తో పాటు కొన్ని మందులు అర్జెంట్ గా ఇప్పించాలని ట్విట్టర్ లో కోరాడు. దానికి వెంటనే స్పందించిన సోనూ సూద్ కావాల్సిన మందులను పంపించాడు. దాంతో కృతజ్ఞతలు చెబుతూ మెహర్ రమేష్ సోనూ పై ప్రశంసలు కురిపించారు. సోనూ సూద్ నువ్వు సూపర్ హ్యూమన్ వి బ్రదర్..కష్టాల్లో ఉన్నవారికి దేవుడివి..కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణ అనే పేషంట్ కోసం కావాల్సిన అన్ని మందులను పంపించావు. సోనూ సూద్ ఫౌండేషన్ అద్భుతంగా పని చేస్తోంది. దేవుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి సమాధానంగా సోనూ..థాంక్యూ ప్రాణాలను కాపాడుదాం.. అంటూ రిప్లై ఇచ్చారు.

More Related Stories