English   

క‌రోనా క‌ట్ట‌డికి అమితాబ్ భారీ విరాళం

Amitabh Bachchan
2021-05-10 18:10:09

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి కొన‌సాగుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. దాంతో ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అయితే ప్ర‌భుత్వం ఎంత చేసినా కేసులు మరీ పెరుగుతుండ‌టంతో వ్యాపార వేత్త‌లు సెల‌బ్రెటీలు సైతం ఆదుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దాంతో ప‌లువురు త‌మవంతు స‌హాయం చేస్తూ ఇత‌రులకు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. 

తాజాగా బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ క‌రోనా క‌ట్ట‌డికి త‌న‌వంతు స‌హాయం చేశారు. ఢిల్లీలోని గురుద్వార్ కోవిడ్ సెంట‌ర్ కు అమితాబ్ రూ. 2 కోట్ల విరాళం ప్ర‌క‌టించారు. అమితాబ్ చేసిన స‌హాయానికి కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న మజిందర్ సింగ్ సిర్సా అమితాబ్ బచ్చన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అమితాబ్ ఇచ్చిన స‌హాయం విదేశాల నుండి ఆక్సీజ‌న్ దిగుమ‌తికి స‌హాయ‌ప‌డుతుంద‌ని అన్నారు. ఈ కోవిడ్ సెంటర్ సేవలు ఈ రోజు నుండే ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండ‌గా ఈ కోవిడ్ సెంటర్ ను 300 ప‌డ‌క‌ల‌తో ఏర్పాటు చేశారు. ఈ సెంట‌ర్ లో ఆక్సీజ‌న్ స‌దుపాయంతో పాటు ఎప్పుడూ డాక్ట‌ర్లు అందుబాటులో ఉండేట‌ట్లు ఏర్పాటు చేశారు.

More Related Stories