English   

ప్ర‌భాస్ సుధ కొంగర కాంబోలో సినిమా

Sudha Kongara
2021-05-11 11:39:52

తమిళ స్టార్ హీరో నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్ లు మూతపడి ఉండటం తో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇక ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించారు. సినిమా మంచి విజయం సాధించడంతో సుధ నెక్ట్స్ ఎవరితో ఉండబోతుందా అన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం సుధ నెక్స్ట్ లో మహేష్ బాబు ,విజయ్ పేర్లు వినిపిస్తున్నాయి. 

మరోవైపు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవలే ప్రభాస్ కు సుధ కథను వినిపించారట. కథ కూడా ప్రభాస్ కు నచ్చిందట. అయితే మరోసారి ఈ కథపై ఇద్దరూ మరోసారి చర్చించుకుని ఫైనల్ చేసే అవకాశం ఉందట. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆది పురుష్, సలార్, రాధే శ్యామ్ సినిమాలు  షూటింగ్ లో ఉన్నాయి. ఇదిలా  ఉండగానే ప్రభాస్ మరో బాలీవుడ్ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

More Related Stories