English   

శ్రీదేవి సోడాసెంట‌ర్ ఫ‌స్ట్ గ్లింప్స్..ఓల్టేజీ ఎక్కువే

Sridevi Soda Center
2021-05-11 14:11:12

యంగ్ హీరో సుధీర్ ఈ రోజు పుట్టిన రోజును జ‌రుపుకుంటున్నారు. అయితే ఆయ‌న పుట్టినరోజు గిఫ్ట్ గా సుధీర్ బాబు న‌టిస్తున్న శ్రీదేవి సోడా సెంట‌ర్ ఫ‌స్ట్ గ్లింప్స్ ను వ‌దిలారు. గ్లింప్స్ ఆఫ్ లైటింగ్ సూరిబాబు పేరుతో వ‌దిలిన ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. ఫ‌స్ట్ గ్లింప్స్ సుధీర్ బాబు కండ‌లు తిరిగిన బాడీతో క‌నిపిస్తున్నారు. 

అయితే హీరోయిన్ మాత్రం షాడో లుక్ లో చూపించారు. సినిమాలో సుధీర్ బాబు సూరి బాబు అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప‌ల్లెటూరి అందాల‌ను చ‌క్క‌గా చూపిస్తూ శ్రీదేవి సోడాసెంటర్ కంథేంటో చెప్ప‌బోతున్నార‌ని అర్థం అవుతోంది. ఇదిలా ఉండ‌గా పలాస ఫేం కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వ‌హిస్తున్నారు. 

రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఆనంది సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. 70 ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రానికి శ్రీకర్ ప్ర‌సాద్ లాంటి టాప్ ఎడిట‌ర్ ప‌నిచేస్తున్నారు.

More Related Stories