English   

ప్రభాస్ సలార్ లో శివగామి

Ramya Krishnan
2021-05-11 15:03:45

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "సలార్" సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ప్రభాస్ కు జోడీగా సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా కు సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ ను గోదావరి ఖని బొగ్గు గనుల్లో తెరకెక్కించారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు. అయితే మధ్యలో కరోనా మహమ్మారి రావడం తో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే షూటింగ్ ను ప్రారంభించనున్నారు. 

అయితే ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. రమ్యకృష్ణ కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రమ్య కృష్ణ ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి అధరగొట్టింది. రమ్యకృష్ణ పాత్ర బాహుబలి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాంతో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ సలార్ కోసం రమ్యకృష్ణ ను తీసుకుంటున్నారట. మరి సలార్ లో రమ్యకృష్ణ ఎలాంటి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుందో చూడాలి. 

More Related Stories