English   

చిరంజీవి, వెంకటేష్ ఓటిటి ఎంట్రీ

Chiranjeevi venkatesh
2021-05-11 15:27:17

లాక్‌డౌన్‌ కాలంలో డిజిటల్‌ వరల్డ్ సంచలనాలు రేపుతుంది. వరసగా అక్కడ విడుదలవుతున్న వెబ్ సిరీస్ లు కూడా రచ్చ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ క్రేజ్ వాడుకోడానికి స్టార్ హీరోలు కూడా సై అంటున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఓటిటి వైపు వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో చిరంజీవి కోసం ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం.. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు సురేష్ బాబు కూడా తమ్ముడు వెంకటేష్‌తో వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే దీనికి సంబంధించిన కథలను రెడీ చేసే పనిలో ఉన్నారు సురేష్ బాబు. ఇప్పటికే తేజ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. మరోవైపు జయంత్ దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్‌ నిర్మించడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం.ప్రస్తుతం వెంకటేష్.. నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరోవైపు సీనియర్ హీరో నాగార్జున.. వెబ్ సిరీస్‌ కోసం సరికొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ రెడీ చేస్తున్నారు. మొత్తానికి మన హీరోలు .. కేవలం సినిమాలనే నమ్ముకోకుండా.. ఇపుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా సత్తా చూపెట్టడానికి రెడీ అవుతున్నారన్న మాట.

More Related Stories