English   

తేజ అభిరామ్ సినిమాలో శ్రీరెడ్డి ఎపిసోడ్

Sri Reddy
2021-05-11 17:26:51

రానా తమ్ముడు దగ్గుబాటి వారసుడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా తేజ దర్శకత్వం లో అభిరామ్ ఫస్ట్ ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ తన పుట్టిన రోజు సందర్భంగా అభిరామ్ ఇచ్చిన ఇంటర్వ్యూ తో ఫస్ట్ సినిమా పై క్లారిటీ వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమా తన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని అభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

అభిరామ్ మాట్లాడుతూ...తాను తాత తండ్రుల పేర్లు చెప్పుకుని గుర్తింపు సంపాదించాలని అనుకోవట్లేదన్నారు. కేవలం ఒక చిన్న హీరోగా తనకు తాను ఎదగాలనుకుంటున్నా అని చెప్పారు. అంతే కాకుండా తన సినిమా తో యూత్ కు ఒక మెసేజ్ ఇస్తానని చెప్పారు. యువత చేసే తప్పులు తమ కుటుంబం పై ప్రభావం చూపుతాయన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అభిరామ్ సూచించారు. 

అంతే కాకుండా ఎదుటివాళ్లను గుడ్డిగా నమ్మవద్దని చెప్పారు. తాను ట్రాప్ లో పడ్డానని అలా చాలా మంది పడతారని..కానీ కొంతమంది భయటకు వస్తారని అన్నారు. నేను యాక్సిడెంట్ చేస్తే నా కుటుంబాన్ని ఎందుకు లాగటం అని ప్రశ్నించారు. ఇక ఫేస్ సినిమాలో తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఇక అభిరామ్ జీవితం లో బ్యాడ్ టైమ్ అంటే శ్రీరెడ్డి ఎపిసోడ్ మాత్రమే. ఎందుకంటే శ్రీరెడ్డి అభిరామ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దాంతో అభిరామ్ తో పాటు ఆయన కుటుంబం ఇబ్బందులు ఎదురుకుంది. మరి అభిరామ్ సినిమాలో శ్రీ రెడ్డి ఎపిసోడ్ ఎలా ఉండేదో తెలియాలంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

More Related Stories