English   

త‌మిళ స్టార్ విజ‌య్ కి తెలుగులో షాకింగ్ రెమ్యున‌రేష‌న్

Thalapathy Vijay
2021-05-12 10:13:30

ప్ర‌స్తుతం త‌మిళ‌, మ‌ళ‌యాల‌, బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా హీరోలు సినిమాలు తీస్తున్నారు. తెలుగు ద‌ర్శ‌కుడు త‌మిళ హిందీ హీరోల‌తో...త‌మిళ , హిందీ ద‌ర్శ‌కులు తెలుగు హీరోల‌తో సైతం సినిమాలు తీస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే త‌మిళ స్టార్ హీరో త‌ళ‌ప‌తి విజ‌య్ తో టాలీవుడ్ దర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతుంది. అంతే కాకుండా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ట‌. అయితే ఈ సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రాలేదు గానీ దాదాపు ఈ సినిమా ఫిక్స్ అనే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. 

అంతే కాకుండా ఈ సినిమాకు విజ‌య్ షాకింగ్ రెమ్యున‌రేష‌న్ ను పుచ్చుకుంటున్న‌ట్టుగా కూడా ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్తులు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం విజ‌య్ ఒక్కో సినిమాకు గానూ దాదాపు రూ80 కోట్ల వ‌ర‌కూ రెమ్య‌న‌రేష‌న్ ను పుచ్చుకుంటున్నార‌ట‌. అయితే దిల్ రాజు అంత‌కంటే ఎక్కువే ఇవ్వ‌డానికి ఒప్పుకున్నార‌ట‌. ఈ చిత్రం కోసం విజ‌య్ కి దాదాపు రూ.90కోట్లు ఇస్తాన‌ని దిల్ రాజు ఒప్పందం చేసుకున్నార‌ట‌. ఇక ఈ సినిమా బ‌డ్జెట్ కూడా దాదాపు రూ.170 కోట్లు ఉంటుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ఇక భారీ బ‌డ్జెట్ తెర‌కెక్కెంచ‌బోయే ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో చూడాలి. 

More Related Stories