English   

కరోనా నుంచి కోలుకున్న అల్లు అర్జున్

 Allu Arjun
2021-05-12 11:27:39

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్దిరోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా పాజిటివ్ రావ‌డంతో అల్లు అర్జున్ హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకున్నారు. అయితే ప‌దిహేను రోజుల‌కు మ‌ళ్లీ క‌రోనా నుండి బ‌న్నీ కోలుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ప‌దిహేను రోజుల త‌ర‌వాత నేను మ‌ళ్లీ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు నెగిటివ్ వ‌చ్చింది. నా ఆరోగ్యం కొర‌కు ప్రార్థ‌న‌లు చేసిన స‌న్నిహితుల‌కు అభిమానుల‌కు కృత‌ఙ్జ‌త‌లు తెలుపుతున్నాను. ఈ లాక్ డౌన్ తో కేసుల సంఖ్య త‌గ్గాల‌ని ఆశిస్తున్నాను. ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి. అంటూ బ‌న్నీ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండ‌గా అల్లు అర్జున్ క‌రోనా పాజిటివ్ రాగేనే అభిమానులు ఆందోళ‌న చెందారు. త‌మ హీరో క‌రోనా నుండి కోలుకోవాల‌ని దేవుళ్ల‌కు పూజ‌లు కూడా చేశారు. ఇక బ‌న్నీ క‌రోనా ను జ‌యించ‌డం అభిమానుల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కారోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. ఇక క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌గానే షూటింగ్ ను తిరిగి ప్రారంభించ‌నున్నారు. 

More Related Stories