English   

తేజ‌కు షాక్ ఇచ్చిన ఉప్పెన బ్యూటీ

Krithi Shetty
2021-05-12 11:52:52

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి వ‌రుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఉప్పెన సినిమా విడుద‌ల‌కు ముందే కృతికి ఎంతోమంది అభిమానుల‌య్యారు. ముఖ్యంగా ఉప్పెన నుండి పాట‌లు విడుద‌లైన త‌ర‌వాత సొట్ట బుగ్గ‌ల సుంద‌రికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. అంతే కాకుండా ఉప్పెన విడుద‌ల‌కు ముందే కృతికి ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఇక ప్ర‌స్తుతం ఈ భామ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అంతే కాకుండా సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలోనూ హీరోయిన్ గా న‌టిస్తోంది. 

మ‌రోవైపు రామ్ హీరోగా తెర‌కెక్క‌బోతున్న ఓ సినిమాలో కూడా కృతి హీరోయిన్ గా న‌టించే ఛాన్స్ కొట్టేసింద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే చేతినిండా సినిమాలతో ఉన్న బ్యూటీ ద‌గ్గుబాటి హీరో అభిరామ్ సినిమాకు మాత్రం నో చెప్పిందట‌. అభిరామ్ హీరోగా ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రాకపోయిన‌ప్ప‌టికీ ఈ సినిమా దాదాపు ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ గా న‌టించేందుకు తేజ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని సంప్రదించార‌ట‌. కానీ కృతి ఆ ఆఫర్ ను సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది. అయితే నో చెప్ప‌డానికి కార‌ణాలు ఏవైనా కృతి ప్ర‌స్తుతం పేరున్న హీరోల ప‌క్క‌న న‌టిస్తోంద‌ని ఇలాంటి స‌మ‌యంలో కొత్త హీరోల‌తో న‌టించ‌డం రిస్క్ అనే నో చెప్పింద‌ని టాక్ వినిపిస్తోంది. 

More Related Stories