English   

ఎమ్మెల్యే ప‌క్క‌న‌ హీరోయిన్ గా శివాని రాజ‌శేఖ‌ర్

 Shivani Rajsekhar
2021-05-12 17:27:27

జీవితా రాజ‌శేఖ‌ర్ ల రెండో కుమార్తె శివాని రాజ‌శేఖ‌ర్ బంపరాఫ‌ర్ కొట్టేసింది. ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే గా గెలిచిన హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ ప‌క్క‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది. హిందీలో సూప‌ర్ హిట్ గా నిలిచిన ఆర్టిక‌ల్ 15 సినిమాను త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ కామ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా...బాలీవుడ్ నిర్మాత బోణీక‌పూర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా శివాని రాజ‌శేక‌ర్ ప్ర‌స్తుతం డ‌బ్ల్యూ డబ్ల్యూ డ‌బ్ల్యూ సినిమాలో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు త‌మిళ బాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. 

క‌రోనా విజృంభ‌నతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక ప‌డింది. అంతే కాకుండా ఇటీవ‌లే జాంబిరెడ్డి సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన తేజ స‌జ్జా ప‌క్క‌న న‌టించేందుకు కూడా శివాని రాజ‌శేఖ‌ర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఫాంట‌సీ ల‌వ్ స్టోరిగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హ‌తేజ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే శివాని సోద‌రి శివాత్మిక కూడా హీరోయిన్ గా రానిస్తోంది. ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన దొర‌సాని సినిమాలో హీరోయిన్ గా న‌టించిన శివాత్మిక త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా రంగ మార్తాండ అనే మ‌రోసినిమాలోనూ శివాత్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది. 

More Related Stories