English   

హాలీవుడ్ లో నటిస్తారా...ఎన్టీఆర్ ఆన్సర్ ఇది

Young Tiger Jr NTR
2021-05-13 11:47:16

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేసారు. అంతే కాకుండా కొరటాల శివ తో సినిమా పై ప్రస్తుతం ఫోకస్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని వెల్లడించారు. అంతే కాకుండా హాలివుడ్ లో అవకాశాలు వస్తే చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా..ఎన్టీఆర్..తప్పకుండా చేస్తాను. హాలీవుడ్ లో చేసే అవకాశం రావడం భారతీయ నటీనటులకు ఓ అదృష్టం దాన్ని ఎవరు కాదంటారు. 

అంతే కాకుండా ఇదివరకు తాను 71 కేజీలు ఉండేవాడినని...కానీ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మరో 9 కిలోలు పెరగాల్సి వచ్చిందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ఎన్నో యాక్షన్ సన్నివేశాలతో ఉండబోతుందని కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఎన్టీఆర్ చెప్పారు. కొన్ని సీన్లకు ప్రేక్షకులు కూర్చులో నుండి లేచి విజిల్స్ కొడుతారని అన్నారు. ఇక ఆర్ఆర్ఆఆర్  గురించి మరిన్నీ విషయాలు చెబుతారా అని ఎన్టీఆర్ ను ప్రశ్నించగా...జక్కన్న గొడ్డలితో నా వెంట పడతారని ఎన్టీఆర్ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.

More Related Stories