English   

అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ వీడియోపై స్పందించిన క్రికెట‌ర్

surya kumar yadav
2021-05-13 12:34:56

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప‌దిహేను రోజుల త‌ర‌వాత కరోనాను జ‌యించారు. దాంతో ప‌దిహేను రోజులు ఐసోలేష‌న్ లో ఉన్న బ‌న్నీ మ‌ళ్లీ కుటుంబాన్ని క‌ల‌వడంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే బ‌న్నీ త‌న పిల్ల‌ల‌తో కలిసిన మూమెంట్ ను వీడియో తీసి సోష‌ల్ మీడిలో పోస్ట్ చేయగా తెగ‌వైర‌ల్ అవుతోంది. అంతే కాకుండా తాజాగా ఈ వీడియోపై భార‌త క్రికెట‌ర్ సుర్య‌కుమార్ యాదవ్  'బ్యూటిఫుల్' అంటూ  స్పందించారు. వీడియోలో అల్లు అర్జున్ మొద‌ట అయాన్ ను చూసి కంట‌త‌డి పెట్టుకుంటూ హ‌త్తుకున్నారు. అంతే కాకుండా ఆ త‌ర‌వాత ఆర్హ ను హ‌గ్ చేసుకుని ఎమోష‌నల్ అయ్యారు. 

ఇదిలా ఉండ‌గా అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా మ‌ల‌యాళ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ ఈ చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బ‌న్నీ నెవ‌ర్ బిఫోర్ పాత్ర‌లో లారీ డ్రైవ‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. గంద‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఎక్కువ‌శాతం ఆంద్ర‌ప్ర‌దేశ్ లోని మారేడుమిల్లి అడ‌వుల్లోనే షూట్ చేశారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. దాంతో క‌రోనా త‌గ్గుముకం ప‌ట్టిన త‌ర‌వాత మ‌ళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించ‌నున్నారు. 
 

More Related Stories