English   

సూర్య ఆకాశం నీ హద్దురా సినిమా కొత్త రికార్డు  

 Aakasam Nee Haddhu Ra
2021-05-14 11:55:05

సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా  సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో గతేడాది విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైన బ్లాక్ బస్టర్ 'ఆకాశం నీ హద్దురా' సినిమా.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2021 పనోరమా విభాగంలోకి 'ఆకాశం నీ హద్దురా' సినిమా ప్రవేశించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన నిర్మాత రాజశేఖర్ పాండియన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాను షాంఘై ఫిలిమ్ ఫెస్టివల్‌లో పానరోమా విభాగంలో ప్రదర్శించనున్నారు. మరోవైపు అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ 'ఐఎండీబీ'లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా రికార్డ్‌ నెలకొల్పింది. దీంతో సూర్య అభిమానులు ఖుషీ ఖషీగా ఉన్నారు.

More Related Stories