English   

క‌రోనాతో ద‌ర్శ‌కుడు నంద్యాల ర‌వి కన్నుమూత

Nandyala Ravi
2021-05-14 12:17:41

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. క‌రోనా సోకడంతో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకున్న ఆయనకు నటుడు సప్తగిరి లక్ష రుపాయల ఆర్థిక సాయం చేయగా.. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) నుంచి కూడా కొంత సాయం అందిన‌ట్లు తెలిసింది. అయినప్పటికీ చికిత్స పొందుతూ  కన్నుమూశారు. పలు చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన నంద్యాల రవి, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాను డైరెక్ట్ చేశారు. స‌ప్త‌గిరితోనూ ఓ సినిమా చేయ‌డానికి క‌థ‌ను సిద్ధం చేసుకున్నారు. కానీ క‌రోనా ఆయ‌న్ని క‌బ‌లించింది. నంద్యాల ర‌వి మృతిపై సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 

More Related Stories