English   

మహేశ్ త్రివిక్రమ్ సినిమాలో శిల్పాశెట్టి

mahesh
2021-05-14 12:40:53

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. వీళ్లద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు ఊహించినంత సక్సెస్ సాధించలేకపోయినా.. ఇరువురి కెరీర్‌లో క్లాసిక్ సినిమాలుగా నిలిచిపోయాయి. అయితే వీళ్లద్దరి సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి.. శిల్పా శెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై త్రివిక్రమ్ ఆమెతో చర్చించగా.. సినిమాలో నటించేందుకు శిల్పా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ గత చిత్రాలన పరిశీలిస్తే.. అందులో కీలకమైన లేడీ పాత్ర ఒకటి ఉంటుంది. ‘అత్తారింటికి దారేది’లో నదియా, ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బు, రీసెంట్‌ సినిమా ‘అల వైకుంఠపురములో’లో టబు నటించినటువంటి వంటి ఓ కీలక పాత్రలో శిల్పా ఈ సినిమాలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

More Related Stories