English   

టాలీవుడ్ లో సీక్వెల్స్ హంగామా..ఎన్ని హిట్టో ఎన్ని ఫట్టో

Tollywood
2021-05-14 16:05:26

ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ జోరు నడుస్తోంది. అయితే తెలుగులో సీక్వెల్స్ రావడం ఇదే కొత్తకాదు. అప్పట్లోనే మొదలయ్యాయి కానీ అప్పట్లో ఈ రేంజ్ లో సీక్వెల్స్ కనిపించలేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో హిట్ కొట్టిన మెగాస్టార్ ఆ తరవాత శంకర్ దాదా జిందాబాద్ అంటూ సీక్వెల్ తో వచ్చారు. కానీ ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఇక 1993లో శివనాగేశ్వర్ డైరెక్షన్ లో మనీ చిత్రం విడుదలైంది. కాగా 2011 లో ఈ సినిమాకు సీక్వెల్ గా మనీ మనీ మోర్ మనీ అనే సినిమా వచ్చింది. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇదిలా ఉండగా బాహుబలి సినిమాను రెండు పార్ట్ లు గా విడుదల చేయగా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ రికార్డులు బ్రేక్ చేసింది. 

మరోవైపు పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ ఘనవిజయం తరవాత సర్ధార్ గబ్బర్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సీక్వెల్స్చూసినట్లయితే...రికార్డులు బ్రేక్ చేసిన కేజీఎఫ్ సినిమాకు ఇప్పటికే కేజీఎఫ్ 2 పెరుతో సీక్వెల్ రెడీ అయింది. అంతే కాకుండా ఎఫ్ 2 విజయం తరవాత అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాను ప్లాన్ చేసాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక పుష్ప సినిమాను సైతం రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక మంచు విష్ణు  ఢీ సినిమాకు సీక్వెల్ గా "ఢీ అండ్ ఢీ", విష్వక్ సేన్ హిట్ సినిమాకు సీక్వెల్ గా "హిట్ 2", సోగ్గాడే చిన్నినాయనా కు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాలు సీక్వెలా గా రాబోతున్నాయి. ఇక ఈ సీక్వెల్స్ లో ఎన్ని హిట్ అవుతాయో ఎన్ని ఫట్ అవుతాయో చూడాలి.

More Related Stories