English   

కరోనా కట్టడికి అజిత్ సాయం..ఎంతంటే

Ajith
2021-05-14 16:45:34

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు వైద్యులు ఎంతో కష్టపడుతున్నా కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు. దాంతో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇక కరోనా నుండి ప్రజలను రక్షించేందుకు సెలబ్రెటీలు సైతం తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రికి కరోనా రిలీఫ్ ఫండ్ కింద హీరో సూర్య , కార్తీ కలిసి చెక్ ను అందజేసిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ప్రముఖ హీరో అజిత్ సైతం కరోనా కట్టడికి తన వంతు సహాయం అందజేశారు. అజిత్ ఈరోజు తమిళనాడు ప్రభుత్వానికి రూపాయలు 25 లక్షలను ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయాన్ని అజిత్ మేనేజర్ అధికారికంగా వెల్లడించారు. ఇక హీరో కరోనా కట్టడి కోసం సహాయం చేయడంతో అజిత్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా అజిత్ నెక్స్ట్ వాలిమై అనే సినిమాలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత బోణీకపూర్ నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.

More Related Stories