English   

పుష్ప ఐటమ్ సాంగ్ కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లు

PUSHPA
2021-05-14 17:24:58

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప‌. ఈ సినిమా నుండి విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు పోస్టర్ లతో ఇప్ప‌టికే ఎన్నో అంచనాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుద‌ల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత‌లు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమాపై మ‌రోవార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. సుకుమార్ సినిమాలంటే ముందు నుండి ఓ ఐట‌మ్ సాంగ్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అది కూడా థియేట‌ర్లో కేక పుట్టించే రేంజ్ ఈ ఐట‌మ్ సాంగ్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాలోనూ ఓ ఐట‌మ్ సాంగ్ ఉండ‌బోతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

అయితే ఈ పాట నెవ‌ర్ బిఫోర్ గా ఉండ‌బోతుంద‌ని టాక్. అంతే కాకుండా ఈ పాట‌లో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ లు బ‌న్నీతో క‌లిసి చిందులు వేయ‌బోతున్నార‌ట‌. ఆ హీరోయిన్ లు ఒక‌రు పూజా హెగ్డే కాగా మ‌రొర‌కరు దిశా ప‌టాని అని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. అయితే ఇది ఎంత వ‌ర‌కూ నిజ‌మో తెలియాలంటే మాత్రం అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చేవ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ సినిమాలో విలన్ గా న‌టిస్తున్నారు. 

More Related Stories