English   

కోవిడ్ బాధితులకు విరాళం అందించిన రజనీ కుమార్తె

rajinikanth
2021-05-15 13:07:11

రెండో దశలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ.. కోవిడ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళ సినీ తారలు అక్కడి కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే హీరోలు సూర్య, కార్తీ తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి.. రూ.కోటి విరాళంగా ఇవ్వగా.. హీరో అజిత్, దర్శకుడు మురగదాస్ రూ.25 లక్షల సహాయం అందించారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. సీఎం స్టాలిన్‌కి కలిసి ఆమె.. కరోనా బాధితుల సహాయం కోసం రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమెతో పాటు మామగారు, భర్త విశాగన్, ఆయన సోదరి కూడా ఈ పనిలో పాలు పంచుకున్నట్లు పేర్కొన్నారు.

More Related Stories