English   

ఆ కొరియోగ్రాఫ‌ర్ ను ప‌వ‌న్ గిల్లి ముద్దు పెట్టార‌ట‌

Shiva Shankar
2021-05-15 14:56:39

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అత్తారింటికి దారేది. సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అయితే తాజాగా శివశంకర్ మాస్టర్ పవన్ పై షాంకింగ్ కామెంట్స్ చేశారు. అత్తారింటికి దారేది సినిమా కంటే చాలా ఏళ్ల ముందు పవన్ ను కలిసినట్టు తెలిపారు. చాలా కాలం తరవాత పవన్ కళ్యాణ్ ను కలవగా ఆయన ఆప్యాయంగా పలకరించారని అన్నారు. దగ్గరకు వచ్చి హగ్ చేసుకున్నారని ప్రేమతో మాట్లాడారని చెప్పారు. అంతే కాకుండా ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో దగ్గరకు వచ్చి చెంపలు గిల్లి ముద్దు పెట్టుకున్నారని చెప్పారు. ఈ వయసులో కూడా డ్యాన్స్ తో అదరగొడుతున్నవని పొగిడినట్టు తెలిపారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ లోని హాస్య చతురత చూశానని చెప్పారు. పవన్ కళ్యాణ్ చాలా ప్రత్యేకమైన పీస్ అని ఆయనతో వర్క్ చేసిన ఎవరైనా చివరి వరకు గుర్తుంచుకుంటారని చెప్పారు.

More Related Stories