English   

అమీర్ ఖాన్ తో ఆర్జీవికి అందుకే చెడిందట

Aamir Khan
2021-05-15 15:39:18

వివాదాస్పద డైరెక్టర్ ఆర్జివీ ఇప్పుడంటే వరుస ఫ్లాప్ లతో సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు టాలీవుడ్ నే కాక బాలీవుడ్ ను కూడా ఊపేశారు. వర్మ తో సినిమా చేసేందుకు అప్పుడు నిర్మాతలు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అయితే రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ రంగీలా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 1995లో వచ్చిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, ఊర్మిళా మంటోడ్కర్ హీరో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించారు. 

అయితే ఈ సినిమా తరవాత రామ్ గోపాల్ వర్మకు అమీర్ ఖాన్ కు మధ్య వివాదాలు తెలెత్తాయి. సినిమా మంచి విజయం సాధించిన ఊపు మీద ఉన్నసమయంలో వర్మ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. సినిమాలో వెయిటర్ గా పనిచేసిన వ్యక్తి అమీర్ ఖాన్ కంటే మెరుగైన యాక్టింగ్ చేశాడని అన్నారు. అయితే దానివల్లే అమీర్ ఖాన్ కు తనకు కొంతకాలం మాటలు లేవని వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉండగా వర్మ దర్శకత్వం వహించిన ఢీ కంపెనీ సినిమా అతడి సొంత ఓటీటీ స్పార్క్ లో విడుదలయింది. దావూద్ ఇబ్రహీం కథతో తీసిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.

More Related Stories