English   

ఆ సీక్రెట్ చెప్ప‌మ‌ని హీరోలు వెంట‌ప‌డుతున్నారు సుధీర్ బాబు

Sudheer Babu
2021-05-15 17:18:28

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్ర‌స్తుతం శ్రీదేవి సోడా సెంట‌ర్ సినిమాలో హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. గోదావ‌రి అందాలు...బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప‌ల్లె చిత్రాలతో ఈ వీడియో ఆక‌ట్టుకునే ఉంది. ఈ సినిమాకు ప‌లాస ఫేం క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఫ‌స్ట్ గ్లింప్స్ లో సుధీర్ బాబు లుక్ ఎంతో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఎనిమిది ప‌ల‌క‌ల బాడీతో సుధీర్ బాబు ప‌డ‌వ నడుపుతుంటే ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. 

అయితే తాజాగా ఓ ఇంట‌ర్యూలో సుధీర్ బాబు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. త‌న సిక్స్ ప్యాక్స్ వెన‌క ఉన్న సీక్రెట్స్ తెలుసుకునేందుకు కొంతమంది హీరోలు త‌న‌కు ఫోన్ లు చేసి మ‌రీ అడుతుంటార‌ని సుధీర్ బాబు చెప్పారు. క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌ర్కౌట్ చేయ‌డం..మంచి డైట్ తీసుకోవ‌డం ద్వారా మ‌న‌కు న‌చ్చిన శ‌రీరాకృతిని పొంద‌వ‌చ్చ‌ని సుధీర్ బాబు అన్నారు. ఇదిలా ఉండ‌గా ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ బాబు మ‌రో సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి న‌టిస్తోంది. 

More Related Stories