English   

వరుణ్ తేజ్ కి కథ చెప్పిన వెంకి కుడుముల  

Venky Kudumula
2021-05-17 12:55:23

వరుణ్ తేజ్ త్వరలో డైరెక్టర్ వెంకి కుడుములతో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. వెంకీ ఇప్పటికే ఛలో- భీష్మ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. తదుపరి అగ్ర హీరోలతో పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి వరుణ్ తేజ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు వెంకీ. ఇప్పటికే వరుణ్ కి ఒక నరేషన్ ఇచ్చాడు. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు వెంకీ. ఒకసారి ఫైనల్ స్క్రిప్ట్ చెప్పేసి వరుణ్ తో గ్రీన్ సిగ్నల్ అందుకున్నాక ఈ సినిమా ఎనౌన్స్ అవుతుంది. ఈ కాంబో సినిమాను ఎవరు నిర్మిస్తారనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే  రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటి కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ గని అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను ఎలాగైనా అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఇటీవల తిరిగి షూటింగ్ ను మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ జరిపారు. కొంత భాగం షూటింగ్ జరపగానే కరోనా సెకండ్ వేవ్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో మళ్లీ షూటింగ్ కు బ్రేక్ పడింది.ఈ సినిమాతో సయీ మంజ్రేకర్  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది.

More Related Stories