English   

మరో యంగ్ హీరోకు నో చెప్పిన ఉప్పెన బ్యూటీ

Krithi Shetty
2021-05-17 13:31:40

ఉప్పెనలా వచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసిన బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమానే సూపర్ హిట్ గా నిలవడంతో కృతి శెట్టి ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం కృతి నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు పక్కన  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజా  సమాచారం ప్రకారం. ఈ బ్యూటీ నిఖిల్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు నో చెప్పిందట. నిఖిల్ హీరోగా 18 పేజీస్ అనే సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో కీలకమైన అతిధి పాత్రకోసం కృతిశెట్టిని మేకర్స్ సంప్రదించారట. కానీ కృతి మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. 

ప్రస్తుతం కృతి హీరోయిన్ గా ఫుల్ జోష్ మీద ఉంది. ఇలాంటి సమయంలో అతిథి పాత్రలు చేస్తే మళ్ళీ అలాంటి పాత్రలే వచ్చే అవకాశం ఉందని భావించిందో ఏమో గానీ నో చెప్పేసింది. ఇదిలా ఉండగానే దగ్గుబాటి హీరో అభిరామ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా కోసం కూడా దర్శకుడు తేజ కృతి శెట్టిని సంప్రదించారట. కానీ కొత్త హీరో పక్కన నటించడం రిస్క్ అని భావించిన కృతి ఈ చిత్రానికి కూడా నో చెప్పిందని బొగట్టా. దాంతో కృతి శెట్టి సినిమాల సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని అర్థం అవుతోంది. మరి చివరికి ఈ అమ్మడి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories