English   

ఆ బ్లాక్ బస్టర్ సినిమాను వ‌ద‌లుకున్న ర‌వితేజ‌

ravi teja
2021-05-17 17:04:34

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఓ సూప‌ర్ హిట్ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించే అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నారు ఆ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 2018లో త‌మిళ హీరో ద‌నుష్ న‌టించిన వ‌డ చెన్నై అనే సినిమా రికార్డులు బ‌ద్దలు కొట్టింది. ఈ సినిమాకు వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ సినిమా లో కీల‌క పాత్ర కోసం ద‌ర్శ‌కుడు వెట్రి మార‌న్ మొద‌ట త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తిని సంప్ర‌దించారట‌. అంతే కాకుండా సినిమా క‌థ‌ను కూడా వినిపించార‌ట‌. కానీ అప్ప‌టికే సేతుప‌తి వేరే సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల వెట్రిమాన్ ఆఫ‌ర్ కు నో చెప్పార‌ట‌. అయితే అదే క‌థ‌ను వెట్రిమాన్ మ‌న టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు వినిపించార‌ట‌. కాగా క‌థ న‌చ్చినా డేట్స్ స‌మ‌స్య కార‌ణంగా ర‌వితేజ కూడా వ‌డ చెన్నై లో న‌టించేందుకు నిరాక‌రించార‌ట‌. ఇక ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయ‌డంతో ర‌వితేజ క్రేజీ ఆఫర్ ను మిస్ చేసుకున్నారు. ర‌వితేజ నో చెప్ప‌డంతో వెట్రిమాన్ ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అమీర్ సుల్తాన్ ను సంప్ర‌దించ‌గా ఆయ‌న క‌థ వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ట‌. ఇక ఈ విష‌యాన్ని దాదాపు మూడు సంవ‌త్స‌రాల త‌ర‌వాత వెట్రిమార‌న్  క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తో జరిగిన తాజా సోషల్ మీడియా చ‌ర్చ‌లో వెల్ల‌డించారు.  

More Related Stories