English   

అనుష్క వెంటప‌డుతున్న బాలీవుడ్ హీరో

Ranbir kapoor
2021-05-17 18:08:13

అందాల తార అనుష్క శెట్టి టాలీవుడ్ ను ఎక్కువ కాలం ఏలిన హీరోయిన్ లలో ఒకరు. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే మొదట్లో గ్లామర్ పాత్రలు చేసిన అనుష్క ఇప్పుడు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటుంది. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ తన సినిమా హీరోయిన్ గా అనుష్క అయితే బాగుంటుందని భావిస్తున్నారట. బాహుబలితో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్కతో రన్బీర్ నటించాలనుకుంటున్నారట. రన్బీర్ ప్రస్తుతం "బ్రహ్మాస్త్ర" సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎదో ఒక భాగంలో అనుష్కను తీసుకోవాలని రన్బీర్ అనుకుంటున్నారట. మరి అనుష్క రన్బీర్ కోరికను నెరవేరుస్తుందా ఈ ప్రాజెక్టు కు ఒకే చెపుతుందా అన్నది చూడాలి. ఇక ఇదే సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
 

More Related Stories