English   

సన్నీలియోన్ కు భారీ కటౌట్...ఎక్కడంటే

Sunny Leone
2021-05-17 18:32:15

సన్నీ లియోన్ అనగానే గుర్తుకువచ్చేవి బుతుసినిమాలే. అయితే సన్నీలియోన్ అలాంటి సినిమాలు ఇప్పుడే మానేసింది. ప్రస్తుతం సన్నీ కేవలం సినిమాల్లోనే నటిస్తూ ఫుల్ బిజీగా వుంది. బాలీవుడ్ కోలీవుడ్ మరియు టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే సన్నీలియోన్ కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా సహాయ  కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. అంతే కాకుండా సన్నీలియోన్ కు ఒక కొడుకు ఉన్నప్పటికీ మన దేశానికి చెందిన ఓ బాలికను దత్తత తీసుకుని కన్న కుతురిలా పెంచుకుంటోంది. సన్నీలియోన్ లో మంచి మానవతావాది ఉంది. వీలయితే, ఆమెపై తీసిన డాక్యుమెంటరీ చూస్తే తెలుస్తుంది. అంతే కాకుండా మండ్య జిల్లా కొమ్మేరహళ్లి ఊరి వాళ్లకు ఆమెలోని మానవతావాదే కనిపించింది.  ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ ఊర్లో ఆమెకు ‘హ్యాపీ బర్త్‌డే సన్ని లియోని అంటూ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలకు తల్లి, అభిమానులకు దేవత’ అని పెద్ద ఫ్లెక్సీ వేయించి ఊరు ఎంట్రీలో పెట్టారు. ఇప్పుడు సన్నీ కటౌట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

More Related Stories