English   

యంగ్ టైగర్ బర్త్ డేకు డబుల్ ట్రీట్

NTR
2021-05-18 12:00:56

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇలీవ‌ల క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఎన్టీఆర్ ఫ్యామిలో తో పాటు హోం ఐసోలేష‌న్ లోకి వెలుతున్నట్టు ప్ర‌క‌టించారు. అయితే ఇటీవ‌ల రంజాన్ సంధ‌ర్బంగా శుభాకాంక్ష‌లు చెబుతూ తాను కోలుకుంటున్నాన‌ని త్వ‌రోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వ‌స్తాన‌ని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పూజ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు ఎన్టీఆర్ బ‌ర్త్ డే మే 20 వ‌ర‌కూ ఆయ‌న కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్ప‌టికే  గ‌త వారం నుండి ఎన్టీఆర్ ను సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ అభిమానుల‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ స‌ర్పైజ్ ఇవ్వబోతుంద‌ట‌. 

ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసి అభిమానుల‌కు గిఫ్ట్ గా ఇవ్వ‌బోతుంద‌ట‌. అంతే కాకుండా ఎన్టీఆర్ కొర‌టాల సినిమా కూడా ఇప్ప‌టికే ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి కూడా ఓ స‌ర్ప్రైజ్ ఉండ‌బోతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అది కూడా ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తున్నారు అనే దానిపై క్లారిటీ రాబోతుంద‌ని టాక్. మ‌రో వైపు ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ తో కూడా సినిమా ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ఎన్టీఆర్ స్వ‌యంగా క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రాబోతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ బర్త్ డేకు ఇన్ని స‌ర్పైజ్ లు అంటే ఫ్యాన్స్ కు పండ‌గే అని చెప్పాలి. 

More Related Stories