English   

మహేష్ ఇంటి వద్ద భారీ సెక్యూరిటీ..కార‌ణం ఇదే

mahesh babu
2021-05-18 12:51:10

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న స్టార్ హీరోలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ కరోనా ను జయించగా..ఎన్టీఆర్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లోని తన ఇంటివద్ద సూపర్ స్టార్ మహేష్ బాను సెక్యూరిటీని కూడా పెంచారట. ఇంట్లో పని చేసేవాళ్ళు మినహా మిగతా వాళ్ళని ఇంట్లోకి రానివ్వడం లేదట. అంతే కాకుండా ఇంట్లో పని చేసేవారికి ప్రతిరోజూ కరోనా టెస్టులు చేస్తున్నారట. ఇదిలా ఉండగా ఇప్పటికే మహేష్ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. దాంతో సెకండ్ డోస్ కూడా తీసుకునే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇక షూటింగ్ లకు దూరంగా ఉన్నప్పటికీ ఆన్లైన్ ద్వారా దర్శకులు నిర్మాతలతో మహేష్ టచ్ లోనే ఉంటున్నారట.

More Related Stories