English   

సాయి తేజ్ తో వేణు శ్రీరామ్

Venu Sriram
2021-05-18 13:06:34

వకీల్ సాబ్ సంచనలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ తన నెక్స్ట్ సినిమా కోసం  రెండు పెద్ద బ్యానర్లతో చర్చలు జరుపుతున్నాడట. ఎవరు ఓకే అంటే వాళ్లతో కలిసి ముందుకు వెళ్లనున్నాడు. ఎవరు ముందుకు వచ్చినా ఈ సినిమాను చేసేది మెగా హీరోతోనే అనే టాక్ వినిపిస్తోంది. ఆ మెగా హీరో ఎవరో కాదు .. సాయితేజ్. అవును .. ఆల్రెడీ ఆయనకు వేణు శ్రీరామ్ ఈ కథను వినిపించినట్టుగా చెప్పుకుంటున్నారు. సాయితేజ్ తాజా చిత్రంగా 'రిపబ్లిక్' నిర్మితమైంది. వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. వేణు శ్రీరామ్ తో సాయితేజ్ చేసే సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ ను గానీ .. ప్రియాంక అరుళ్ మోహన్ ను గాని కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

More Related Stories