English   

సైనికుడి పాత్ర‌లో ప్ర‌భాస్

Prabhas
2021-05-18 16:34:39

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం మూడు క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మూడు సినిమాలు ఆదిపురుష్, స‌లార్, రాధేశ్యామ్ ల‌ను పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కిస్తున్నారు. ఆది పురుష్ లో ప్ర‌భాస్ రాముడి పాత్రలో క‌నిపిస్తుండ‌గా..రాధే శ్యామ్ లో ప్రభాస్ ల‌వ‌ర్ బాయ్ గా క‌నిపించ‌నున్నాడు. అయితే ప్ర‌భాస్ స‌లార్ లో ఎలాంటి రోల్ చేస్తార‌న్న‌దానిపై మాత్రం క్లారిటీ లేదు. దీనిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో ప్ర‌భాస్ డ్యూయ‌ర్ పోషిస్తార‌ని తాజాగా ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

అంతే కాకుండా తండ్రీ మరియు కొడుకు పాత్ర‌ల్లో ప్ర‌భాస్ క‌నిపించ‌నున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. అయితే ఒక పాత్ర‌లో ప్ర‌భాస్ మెకానిక్ గా క‌నిపించ‌గా మ‌రో పాత్ర‌లో ప్ర‌భాస్ ఆర్మి ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నార‌ట‌. అంతే కాకుండా ఆర్మీ ఆఫీస‌ర్ గా ఓ భారీ యాక్ష‌న్ సీన్ కూడా ఉండ‌బోతుంద‌ట‌. అయితే ఇందులో ఎంతవ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత‌వ‌ర‌కు వెయిట్ చేయాల్సింది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాకు కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ కు జోడీగా శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇక క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో వేరే దేశాల‌కు వెల్ల‌కుండా ఈ సినిమా షూటింగ్ ను హైద‌రాబాద్ లోనే ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.  

More Related Stories