English   

రూమర్లకు చెక్ పెట్టిన కృతీ శెట్టి 

Krithi Shetty
2021-05-19 10:00:26

ఉప్పెన తరువాత  దర్శక నిర్మాతలు  ఆమె కాల్షీట్ల కోసం వెయిట్‌ చేస్తున్నారంటే ఆమె క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాని 'శ్యామ్‌ సింగరాయ్‌'తో పాటు సుధీర్‌ భాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కొత్త చిత్రంలోనూ కృతిని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. అయితే ఈ మూడు చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇదంతా వట్టి పుకార్లేనని తేల్చిపారేసింది కృతీ.

"నా తర్వాతి ప్రాజెక్టుల గురించి చాలా రూమర్లు విన్నాను. ప్రస్తుతం నేను మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నాను. అవి హీరోలు నాని, సుధీర్‌ బాబు, రామ్‌తో ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేయడం మీదే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. ఒకవేళ మరేదైనా ప్రాజెక్ట్‌ ఒప్పుకుంటే నేనే స్వయంగా తెలియజేస్తాను" అని కృతీ శెట్టి క్లారిటీ ఇచ్చింది.

More Related Stories