English   

అభిమానుల‌కు ఎన్టీఆర్ రిక్వెస్ట్

 Jr NTR
2021-05-19 11:26:33

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌ల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ లో ఎన్టీఆర్ అభిమానులు సంద‌డి చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ బ‌ర్త్ డే ను ఏలా సెల‌బ్రేట్ చేద్దామా అని ప్లాన్ లు వేస్తున్నారు. అయితే క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో త‌న పుట్టిన‌రోజు సంబురాలు జ‌ర‌ప‌వ‌ద్ద‌ని ఎన్టీఆర్ అభిమానుల‌కు రిక్వెస్ట్ చేసారు. ఈ సంద‌ర్భంగా ఓ లేఖ‌ను ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. 

లేఖలో  "నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను . గత కొద్ది రోజులుగా. మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను...?  ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తి గా కోలుకుని, కోవిడ్‌ ను జయిస్తానని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూప ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనం గా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి పట్టునే ఉంటూ, లాక్‌ డౌన్‌ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్త గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనా తో యుద్దం చేస్తోంది. కనిపించని శత్రువు తో అలుపెరుగని పోరాటం చేస్తున్న మన డాక్టరు, నర్స్ లు మరియు ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్త గా చూసుకోండి. మీరు జాగ్రత్త గా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా గ‌డ‌పండి. త్వరలో మన దేశం ఈ కరోనా ను జయిస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు, మాస్క్‌ ధరించండి. జాగ్రత్త గా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మీ ఎన్టీఆర్" అంటూ లేఖ‌లో పేర్కొన్నారు. 

More Related Stories