English   

వ‌రుణ్ తేజ్ తో వివాదం..క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్

 Varun Tej Ghani
2021-05-19 17:47:46

మెగా హీరో వ‌రుణ్ తేజ్ కిరణ్ కొర‌పాటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా ఘ‌ని. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్టటికే ఈ సినిమా షూటింగ్ కొంత‌వ‌ర‌కూ పూర్త‌యింది. అయితే గ‌త‌కొద్ది రోజులుగా ఈ సినిమాపై ర‌క‌ర‌కాల వార్తలు వ‌స్తున్నాయి. ద‌ర్శ‌కుడు హీరో మ‌ధ్య క్లాషెస్ వ‌చ్చ‌య‌ని...సినిమా ఔట్ పుట్ వ‌రుణ్ తేజ్ కు న‌చ్చ‌డంలేద‌ని వార్తలు వ‌చ్చాయి. ఇక ఇటీవ‌ల ఘ‌ని సినిమా సెట్ ను తీసివేయ‌డంతో ఆ వార్త‌ల‌కు మ‌రింత‌ బ‌లం చేకూరింది. కాగా తాజాగా ఆ వార్త‌ల‌పై ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర‌పాటి క్లారిటీ ఇచ్చారు. 

ఘ‌ని సినిమాకు ముందు నుండి వరుణ్ తేజ్ మెయిన్ పిల్ల‌ర్ గా ఉన్నారు. ఆయ‌న‌కు సినిమా ఔట్ పుట్ కూడా భాగా న‌చ్చింది. కానీ ఇంట‌ర్నెట్ లో ఇలాంటి వార్త‌లు ఎక్క‌డ నుండి వ‌చ్చాయో నాకు అర్థం కావ‌డంలేదు. సెట్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం చూస్తుంటే ఇప్ప‌ట్లో షూటింగ్ ను ప్రారంభించేలా ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. అంతే కాకుండా సెట్ కు రెంట్ కూడా ఎక్కువ అవుతుంది. అందువ‌ల్లే సెట్ ను తొలగించాం త‌ప్ప ఇతర కార‌ణాలు లేవంటూ కిరణ్ కొర‌పాటి క్లారిటీ ఇచ్చారు. దాంతో ఇన్ని రోజులు ఘ‌ని సినిమాపై వ‌చ్చిన వార్త‌లన్నీ గాలి వార్త‌లేన‌ని క్లారీటీ వ‌చ్చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ నెవ‌ర్ బిఫోర్ రోల్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు కూడా ఆక‌ట్టుకునేవిధంగా ఉన్నాయి. 

More Related Stories