English   

రియ‌ల్ హీరో పాన్ ఇండియా సినిమా..ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే

Krish
2021-05-19 18:12:45

విభిన్న క‌థ‌ల‌తో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునే క్రిష్ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ సినిమా త‌ర‌వాత క్రిష్ సోనూసూద్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంతే కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ట‌టికే సోనూసూద్ ఆయ‌న చేస్తున్న సేవా కార్య‌క్రామాల ద్వారా రియ‌ల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో ప్రారంభించిన సేవా కార్యక్ర‌మాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. 

ముఖ్యంగా ప్ర‌స్తుతం క‌రోనా వైద్యానికి ఉప‌యోగిస్తున్న రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్ మ‌రియు ఆక్సీజ‌న్ కావాల‌ని ప్ర‌జ‌లు సోనూసూద్ కే రిక్వెస్ట్ లు పెడుతున్నారు. అంతే కాకుండా ఇప్ప‌టికే దేశానికి నాలుగు ఆక్సీజ‌న్ ప్లాంట్ ల‌ను తీసుకురావ‌డానికి సోనూసూద్  ర‌ష్యా ఇత‌ర దేశాల‌తో సోనూ ఒప్పందం చేసుకున్నారు. దాంతో ఆయ‌న‌ను సినిమాల్లో సైతం హీరోగానే చూడాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంతో మంది ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు సోనూసూద్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా సోనూసూద్ ప్ర‌స్తుతం మెగాస్టార్ హీరోగా న‌టిస్తున్నా ఆచార్య సినిమాలో విల‌న్ గా న‌టిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ లోనూ ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు. 

More Related Stories