English   

ప‌వ‌న్ బండ్ల సినిమాకు ద‌ర్శ‌కుడు కావ‌లెను

 Bandla Ganesh
2021-05-20 10:37:45

ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ అయ్య‌ప్పనుమ్ కోషియం రీమేక్, హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాల షూటింగ్ ల‌ను మొద‌లు పెట్టగా క‌రోనా వల్ల బ్రేక్ ప‌డింది ఇదిలా ఉండ‌గానే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ నినిమా చేసేందుకు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అంతే కాకుండా బండ్ల‌గ‌ణేష్ నిర్మాణంలోనూ ఓ సినిమా చేసేందుకు ప‌వ‌న్ ఒప్పుకున్నార‌ట‌. ఈ విషయాన్ని బండ్ల సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ప‌వ‌న్ తో ప‌క్కా సినిమా ఉంటుంద‌ని బండ్ల ఇటీవ‌ల ట్వీట్ చేశారు. అయితే కొద్దిరోజులుగా బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు రమేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. 

అయితే దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డంతో అవి పుకార్లేన‌ని క్లారిటీ వ‌చ్చేసింది. అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కూ బండ్ల గ‌ణేష్ బ్యాన‌ర్ లో సినిమా చేసేంద‌కు కూడా ఒప్పందం చేసుకోలేద‌ట‌. ఒక‌వేళ బండ్ల గ‌ణేష్ స‌రైన ద‌ర్శ‌కుడితో వ‌చ్చి ప‌వ‌న్ ను మెప్పిస్తే అప్పుడు వీరి కాంబినేష‌న్ లో సినిమా ఉంటుంద‌ట‌. దాంతో బండ్ల గ‌ణేష్ ఇప్పుడు ప‌వ‌న్ కోసం ద‌ర్శ‌కుడిని వెతికే ప‌నిలో ఫుల్ బిజీగా ఉన్నారు. చూడాలి మ‌రి బండ్ల... ప‌వ‌న్ కోసం ఏ ద‌ర్శ‌కుడిని బ‌రిలోకి దింపుతారా అన్న‌ది. 

More Related Stories