English   

ఇన్స్టాలో నంబ‌ర్ వ‌న్ స్థానానికి రౌడీ హీరో

Vijay Devarakonda
2021-05-20 11:33:57

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. హీరో పక్కన ఫ్రెండ్ రోల్స్ చేసిన విజయ్ ప్రస్తుతం టాప్ హీరోలకు దీటుగా ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యి మొదటి సినిమా తోనే హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరవాత అర్జున్ రెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు క్రియేట్ చేసాడు. ఇక ప్రస్తుతం ఈ రౌడీ హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. 

బాలీవుడ్ భామ అనన్య పాండే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం అవబోతున్నాడు. బాలీవుడ్ నిర్మాత బోణీకపూర్ ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ కొత్త రికార్డును క్రియేట్ చేసాడు. సౌత్ ఇండియాలోనే 12 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా దేవరకొండ రికార్డు క్రియేట్ చేసాడు. సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ఫాలోయింగ్ వచ్చింది అంటే విజయ్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

More Related Stories