English   

ఆర్ఆర్ఆర్ సర్ప్రైజ్... బల్లెం గురిపెట్టిన గోండు బెబ్బులి

Jr NTR
2021-05-20 11:39:32

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే కరోనా పాజిటివ్ రావడం తో ఎన్టీఆర్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అంతే కాకుండా కరోనా విజృంభన నేపథ్యంలో పుట్టిన రోజున ఎలాంటి సెలబ్రేషన్స్ చేయకూడదని ఎన్టీఆర్ అభిమానులకు పిలుపునిచ్చారు. తాను కొలుకుంటున్నానని...  కరోనా మహమ్మారి దేశాన్ని విడిచి వెళ్లిన తరవతే సెలబ్రేట్ చేసుకుందామని ఓ లేఖను విడుదల చేసారు. అయితే అభిమానులను నిరాశపర్చకుండా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఎన్టీఆర్ పోస్టర్ ను వదిలి పుట్టిన రోజున ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇచ్చింది. 

పోస్టర్ లో ఎన్టీఆర్ నల్లని కుర్తా తో పాటు పంచెకట్టులో కనిపిస్తున్నారు. బల్లెం పట్టుకున్న గోండు బెబ్బులిలా ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ ను ఎన్టీఆర్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఈ పోస్టర్ ను విడుదల చేసిన జక్కన్న ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మా భీముడు బంగారం లాంటి హృదయం ఉన్నోడు కానీ...తేడా వస్తే కథ వేరేలా ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ వీడియో కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ మోరీస్ నటిస్తోంది.

More Related Stories