English   

కుటుంబానికి స్టాఫ్ కు బ‌న్నీ వ్యాక్సినేష‌న్

Allu Arjun
2021-05-20 16:47:12

క‌రోనా సెకండ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఫ‌స్ట్ వేవ్ కంటే వేగంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. అంతే కాకుండా సెకండ్ వేవ్ లో మ‌ర‌ణాల సంఖ్య కూడా అధికంగా న‌మోద‌వుతుంది. క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ క‌రోనా టెన్ష‌న్ మొద‌లైంది. ఇప్ప‌టికే ప‌ల‌వురు న‌టీన‌టులు క‌రోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటుండ‌గా మ‌రి కొంద‌రు కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలో హీరోలు ముందు జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న సిబ్బంది మిన‌హా ఇత‌రులెరినీ ఇంట్లోకి రానివ్వ‌కుండా సెక్యురిటీని పెంచిన‌ట్టు తెలుస్తుంది. 

అంతే కాకుండా ఇంట్లో ప‌నిచేసే సిబ్బంది కూడా ప్ర‌తి రోజు క‌రోనా టెస్టు చేసుకున్నాకే ఇంట్లోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా క‌రోనా పై జాగ్ర‌త్త‌గా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. త‌న కుంటుంబ స‌భ్యుల‌కు బ‌న్నీ ద‌గ్గ‌రుండి వ్యాక్సిన్ వేయించార‌ట‌. అంతే కాకుండా త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందిలో 45 ఏళ్లు పై బ‌డిన వారికి కూడా బ‌న్నీ స్పెష‌ల్ కేర్ తీసుకుని వ్యాక్సిన్ వేయించిన‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా బ‌న్నీ కూడా ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ రాగా హోం ఐసోలేష‌న్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంత‌రం క‌రోనా నుండి కోలుకున్నారు. 

More Related Stories